పరిపాలన భారం మోస్తారు... ప్రజల సంక్షేమానికి పాటుపడతారు... పేరుకు ప్రభుత్వోద్యోగులు... సమస్యలతో నిత్యం సతమతమవుతూవుంటారు...
పరిపాలన భారం మోస్తారు... ప్రజల సంక్షేమానికి పాటుపడతారు... పేరుకు ప్రభుత్వోద్యోగులు... సమస్యలతో నిత్యం సతమతమవుతూవుంటారు... ఎప్పుడో రావలసిన పీఆర్సీ... పిల్లల చదువుకు ఉపయోగపడుతుందని, నెల వాయిదాల్లో ఫ్లాట్ కొనుక్కోవచ్చని, అరకొర ఇంటి బడ్జెట్ నుంచి విము క్తి పొందవచ్చని కళ్లు కాయలు కాసే లా ఎదురుచూస్తుంటే... ప్రభుత్వ ధోరణి నిరాశ కలిగి స్తోంది. ముఖ్యమంత్రి వైఖరి నిరుత్సాహం గా ఉంది. బతికేదెలా బాబూ... అని ఉద్యోగులు దీనంగా ప్రశ్నిస్తున్నారు.
ఉన్నత స్థాయి కలే!
జీతం కుటుంబ పోషణకే అంతంతమాత్రంగా సరిపోతుంది. ఇక పిల్లల ఉన్నత చదువులెలా? నా చేతికందేది రూ.36 వేలు. కుటుం బ సభ్యులం ఐదుగురం. నిత్యావసరాలకు 15 వేలు, అద్దెకు 6 వేలు, ఇద్దరు పిల్లల ఫీజులు వగైరా 7 వేలు, కరెంటు, పెట్రోలు 2 వేలు, వై ద్య ఖర్చులకు రూ.1500, వినోదానికి వేయి, ఫంక్షన్లకు వెళ్తే కనీసం వేయి ఖర్చవుతుంది. అత్యవసర ఖర్చుగా రెండు మూడు వేలైనా చేతిలో ఉండాలి. వెనకేసుకోవడానికి ఏమీ మిగలని పరిస్థితి. ఫిట్‌మెంటు 63% ఇవ్వకపోతే పిల్లలకు ఉన్నత చదువులు కష్టమే. -కోడా సింహాద్రి, ఉపాధ్యాయుడు