
డ్వాక్రా మహిళలకూ టోపీ!
రైతులకు రుణమాఫీ విషయంలో టోపీపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా డ్వాక్రా మహిళలకూ టోపీ పెడుతున్నారు. డ్వాక్రా రుణ మాఫీ భారాన్ని గణనీయంగా తగ్గించుకునేం దుకు ఎత్తులు వేస్తున్నారు.
రూ.లక్షలోపు అప్పు తీసుకున్న సంఘాలకే రుణ మాఫీ వర్తింపు
తిరుపతి: రైతులకు రుణమాఫీ విషయంలో టోపీపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా డ్వాక్రా మహిళలకూ టోపీ పెడుతున్నారు. డ్వాక్రా రుణ మాఫీ భారాన్ని గణనీయంగా తగ్గించుకునేం దుకు ఎత్తులు వేస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న మహిళా సంఘాలకు మాత్రమే రుణ మాఫీ వర్తింపజేసి.. తక్కిన సంఘాలకు ప్రోత్సాహంగా రూ.లక్ష మూలధన పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయిం చారు. మూలధన పెట్టుబడికి సంబంధించి శనివారం జీవో (ఎంఎస్ నం: 164) జారీ అరుున విషయం తెలిసిందే. ఇక లక్షలోపు రుణాలకు మాత్రమే మాఫీ పరిమితం చేయడం ద్వారా డ్వాక్రా రుణ మాఫీ భారం మొత్తాన్ని రూ.3,500 కోట్లకే పరిమితం చేయూలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
వ్యవసాయ, డ్వాక్రా సంఘాల రుణమాఫీపై ఏర్పాటైన కోటయ్య కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సీఎం ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష వంతున రాష్ట్రంలోని 7.6 లక్షల సంఘాలకు రూ.7,600 కోట్ల రుణాలను మాఫీ చేస్తానన్నారు. తాజాగా ఆ భారాన్ని కూడా తగ్గించుకోవడానికి యత్నిస్తున్నారు. రాష్ట్రం లోని 7.6 లక్షల సంఘాలకు చెందిన 89 లక్షల మంది మహిళలు రూ.14,204 కోట్లు బకాయి పడ్డారు.