‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కేసు | case filed in Gail officials | Sakshi
Sakshi News home page

‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కేసు

Jun 29 2014 2:05 AM | Updated on Sep 2 2017 9:31 AM

నిర్లక్ష్యంగా వ్యవహరించి పలువురి ప్రాణాలు పోవడానికి కారకులైన ‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కింద కేసు నమోదు చేసినట్టు ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్‌సింగ్ తెలిపారు.

 ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్‌సింగ్
 
 సాక్షి, రాజమండ్రి: నిర్లక్ష్యంగా వ్యవహరించి పలువురి ప్రాణాలు పోవడానికి కారకులైన ‘గెయిల్’ అధికారులపై సెక్షన్ 304ఎ కింద కేసు నమోదు చేసినట్టు ఉత్తరకోస్తా జిల్లాల ఐజీ అతుల్‌సింగ్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఐజీ సింగ్ రాజమండ్రి పోలీసు అతిథి గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విచారణ పూర్తయ్యాక అవసరమైతే సెక్షన్లు మారుస్తామన్నారు. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందాన్ని కూడా రప్పిస్తున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి, ఓఎస్‌డీ రమాదేవి, డీఎస్పీలు నామగిరి బాబ్జీ, ఉమాపతివర్మ, మురళీకృష్ణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement