డెంగ్యూతో సీఏ విద్యార్థి మృతి | CA Student dies of Dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో సీఏ విద్యార్థి మృతి

Aug 1 2015 6:07 PM | Updated on Sep 3 2017 6:35 AM

సీఏ చదువుతున్న ఓ విద్యార్థి డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు.

తిమ్మాజీపురం (వైఎస్సార్ జిల్లా) :  సీఏ చదువుతున్న ఓ విద్యార్థి డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్ జిల్లా తిమ్మాజీపురం మండలం కతనూరు గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి(22) విజయవాడలోని ఒక కళాశాలలో సీఏ చదువుతున్నాడు.

కాగా గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతను తన స్వస్థలమైన కతనూరు గ్రామంలోని ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా బెంగళూరులో చికిత్స పొందుతూ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement