
'కేంద్రాన్నిచూసి టీడీపీ భయపడుతోంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో దూకుడుగా వ్యవహరించవద్దని టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారించడం సరికాదని సి.రాంచంద్రయ్య స్పష్టం చేశారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో దూకుడుగా వ్యవహరించవద్దని టీడీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించడం సరికాదని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. కేంద్రాన్ని చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఏపీ కౌన్సిల్ మాట్లాడిన ఆయన.. సొంత లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏంచేశారో అర్ధం కావడం లేదని రామచంద్రయ్య విమర్శించారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కేంద్రాన్ని టీడీపీ నిలదీయలేకపోతే.. ఇతర పార్టీలు ప్రశ్నించాయి. విదేశీ పర్యటనలతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.