జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన | Buggana Rajendranath Reddy was Appointed as the Ysr District Incharge Minister | Sakshi
Sakshi News home page

జిల్లా ఇన్‌చార్జి మంత్రి బుగ్గన

Jun 23 2019 8:33 AM | Updated on Jul 10 2019 8:16 PM

Buggana Rajendranath Reddy was Appointed as the Ysr District Incharge Minister - Sakshi

సాక్షి, కడప :  జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆర్థికమంత్రి బుగ్గన టీడీపీ ప్రభుత్వంలో పీఏసీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆర్థిక ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఈయన్ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న  వైఎస్‌ఆర్‌ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. తద్వారా జిల్లాలో చేపట్టే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం సులభంగా పొందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement