సెలెక్ట్‌ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు: బుగ్గన

Buggana Rajendranath Reddy Comments Over Decentralization Bill In Council - Sakshi

సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం చైర్మన్‌ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌, కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో జ్యూడిషియల్‌ క్యాపిటల్‌, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఉంటుంది. అమరావతిలో శాసన సభ, శాసన మండలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ ఉంటాయి’ అని పేర్కొన్నారు. 

ఇక చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు యనుమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. మంత్రులు సభలో ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన బుగ్గన చైర్‌ను మీరెలా డిక్టేట్‌ చేస్తారని ప్రశ్నించారు. అదే విధంగా బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న టీడీపీ సభ్యులకు సమాధామనిస్తూ... బిల్లును చర్చకు తీసుకున్నపుడు ఎలాంటి మోషన్‌ మూవ్‌ చేయలేదు కాబట్టి... ఇప్పుడు సెలెక్ట్‌ కమిటీ అంటూ కొత్త వాదనలను తెరమీదకు తీసుకురావడం సరికాదని హితవు పలికారు. ఈ క్రమంలో శాసన మండలిని 15 నిమిషాల పాటు చైర్మన్‌ వాయిదా వేశారు.

చదవండి: మండలిలో లోకేష్‌కు సవాల్‌ విసిరిన మంత్రి బుగ్గన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top