హీరో శివాజీపై దాడికి యత్నం.. ఉద్రిక్తత!

BJP Supporters Tries To Attck On Actor Sivaji - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. నటుడు శివాజీపై బీజేపీ కార్తకర్తలు దాడికి యత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. ఢిల్లీ నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రానున్నారు. ఆయన రాక కోసం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎయిర్‌పోర్టులో ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో హీరో శివాజీ విమానం దిగి రావడాన్ని గమనించిన బీజేపీ శ్రేణులు ఆయనను చుట్టుముట్టాయి. శివాజీని అడ్డుకున్న కార్యకర్తలు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ శివాజీని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో వారు శివాజీపై దాడికి యత్నించగా.. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఆపరేషన్ గరుడ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ చేపట్టిందని, అందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావించిందని ఇటీవల శివాజీ ఆరోపణలు చేశారు. ఆ ఆపరేషన్ కోసం ఇప్పటికే భారీగా నగదు దక్షిణాది రాష్ట్రాలకు చేరిందంటూ ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top