బలహీనపడిన అల్పపీడనం | Bay of Bengal depression weakens | Sakshi
Sakshi News home page

బలహీనపడిన అల్పపీడనం

Oct 28 2013 8:44 AM | Updated on Sep 2 2017 12:04 AM

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.


విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. పూరీ నుంచి కోస్తాంధ్ర మీదగా దక్షిణ కోస్తా మీదగా ఈ అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీనికి తోడు కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.

విశాఖ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు. కన్నూరుపాలెంలో 27 సెం.మీ., కశింకోటలో 19, అనకాపల్లిలో 18, ఎస్.రాయవరంలో 15, యలమంచిలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 21, ఎస్.కోటలో 15, డెంకాడలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శ్రీకాకుళం జిల్లా నాగావళి నదికి వరద ముప్పు తప్పింది. అర్థరాత్రి లక్ష 3వేల క్యూసెక్కలకు ఉన్న నదీ ప్రవాహం...ఉదయానికి 80వేల క్యూసెక్కుల వరకూ తగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement