బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ కర్నూలు | Ball Badminton Champion Kurnool | Sakshi
Sakshi News home page

బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్ కర్నూలు

Dec 9 2013 3:43 AM | Updated on Aug 24 2018 2:33 PM

ఆంధ్ర రాష్ట్ర సీనియర్ అంతర్‌జిల్లా బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళా విభాగంలో కర్నూలు జట్టు చాంపియన్‌గా నిలిచింది.

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: ఆంధ్ర రాష్ట్ర సీనియర్ అంతర్‌జిల్లా బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళా విభాగంలో కర్నూలు జట్టు చాంపియన్‌గా నిలిచింది. గుంటూరు జట్టు రన్నర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో విశాఖ-కృష్ణా జిల్లాల మధ్య పోటీ రసవత్తరంగా సాగినా, వెలుతురు లేకపోవడంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. స్థానిక నంద్యాల పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగాయి. మహిళల విభాగంలో కర్నూలు జట్టు 29-20, 29-17స్కోరుతో కృష్ణా జట్టును ఓడించి ఫైనల్స్‌కు చేరింది. మరో సెమీఫైనల్స్‌లో గుంటూరు 29-22, 29-20సోర్కుతో విజయనగరంపై విజయం సాధించింది.

కర్నూలు-గుంటూరు జట్ల మధ్య పోటాపోటీగా సాగింది. జట్టు కెప్టెన్ మౌనిక అద్భుతమైన ప్రతిభను కనపరిచింది. తొలి మ్యాచ్ పోటాపోటీగా సాగినా, తర్వాత మ్యాచ్‌లో సునాయసంగా సాగింది. కర్నూలుజట్టు 29-20, 29-17స్కోరుతో ఘన విజయం సాధించి, చాంపియన్‌షిప్‌ను సాధించింది. ఈ జట్టు చాంపియన్‌షిప్‌ను సాధించడం రెండో సారి. పురుషుల విభాగంలో ఫైనల్ మ్యాచ్ విశాఖ, కృష్ణా జట్ల మధ్య మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైంది. ఈ జట్ల మధ్య బెస్టాఫ్‌త్రీ మ్యాచ్‌లను ఆడించారు. అనంతరం ఇరు జట్ల క్రీడాకారులు అద్భుతమైన షాట్లతో పోటీగా ఆడారు. అయితే సమయం 5.45 నిమిషాలైన 3వ మ్యాచ్ కొనసాగుతూ ఉండటం, వెలుతురు తగ్గడంతో రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేశారు. అనంతరం ఇరుజట్లను విజేతలుగా ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement