ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు! | balakrishna becomes grand pa on ugadi day | Sakshi
Sakshi News home page

ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు!

Mar 21 2015 5:03 PM | Updated on Aug 29 2018 3:37 PM

ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు! - Sakshi

ఉగాది రోజునే బాలయ్య.. తాతయ్యారు!

ఉగాది పండుగ నందమూరి.. నారా కుటుంబాలకు కొత్త సంబరాలు తెచ్చింది.

ఉగాది పండుగ నందమూరి.. నారా కుటుంబాలకు కొత్త సంబరాలు తెచ్చింది. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మగబిడ్డకు జన్మనిచ్చింది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు డెలివరీ అయ్యింది. దాంతో ఉగాది రోజునే టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాతయ్యలు అయ్యారు. బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు ఏకైక కుమారుడు లోకేష్కు ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా ఉగాది రోజునే వారికి మగబిడ్డ పుట్టడంతో.. రెండు కుటుంబాల్లో సంతోషం రెట్టింపు అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement