హంద్రీ-నీవా కాలువలో స్కూల్ బస్సు బోల్తా


ఉరవకొండ, న్యూస్‌లైన్ : ఉరవకొండ పట్టణంలోని ఏవీఆర్ ఇంగ్లిష్ మీడియుం స్కూల్  బస్సు (ఏపీ04 ఈ2414) వుంగళవారం చిన్నముస్టూరు గ్రామం వద్ద అదుపు తప్పి హంద్రీ-నీవా కాలువలో బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో పిల్లలెవరూ లేకపోవడంతో పెను ప్రవూదం తప్పింది. ఏవీఆర్ స్కూల్‌కు ఆమిద్యాల, రాకెట్ల, మోపిడి, ముస్టూరు తదితర గ్రావూల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వీరిని వుంగళవారం సాయుంత్రం స్కూల్ బస్సు గ్రావూల్లో వదిలిపెట్టి ఉరవకొండకు వెనుదిరిగింది. హంద్రీ-నీవా కాలువ వద్ద వుుందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయుబోరుు, అదుపుతప్పి హంద్రీ-నీవా కాలువలో పడింది.

 

 డైవర్ రఫీ, క్లీనర్ నాయుడు స్వల్పగాయూలతో బయుటపడ్డారు. ఆ సమయంలో బస్సును క్లీనర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని ఉరవకొండ సీఐ యుల్లంరాజు, ఎస్‌ఐ శంకర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్కూల్ యూజవూన్యం మాత్రం నోరు మెదపడం లేదు. కాగా.. బస్సు సరైన కండీషన్‌లో లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నారుు. డ్రైవర్ అతి వేగంతో బస్సును నడుపుతుంటాడని, అయినా యూజవూన్యం ఎలాంటి సూచనలూ చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top