
ఒకే కాన్పులో ముగ్గురి జననం
ఓ గర్భిణి ఒకే కాన్పులో ముగ్గురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో చోటుచేసుకుంది. మనోజమ్మ అనే మహిళ
చింతలపూడి : ఓ గర్భిణి ఒకే కాన్పులో ముగ్గురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో చోటుచేసుకుంది. మనోజమ్మ అనే మహిళ కాన్పు కోసం ఫాతిమాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆదివారం సాయంత్రం ఒక శిశువుకు జన్మనిచ్చిన మనోజమ్మకు సోమవారం ఉదయం మరో ఇద్దరు బిడ్డలు పుట్టారు. ముగ్గురూ ఆడపిల్లలే కావడం విశేషం. సిజేరియన్ అవసరం లేకుండా సుఖప్రసవం అరుునట్టు ఫాతిమా హాస్పిటల్ వైద్యురాలు థెరిస్సా కుట్టి తెలిపారు. పుట్టిన శిశువులు బరువు తక్కువగా ఉండటంతో ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.