ఆటో డ్రైవర్‌ నిజాయితీ

Auto Driver Return To Jewellery Bag In Police Station - Sakshi

రూ.7 లక్షల విలువైన నగలు ఉన్న బ్యాగు పోలీసులకు అప్పగింత

నిజాయితీ చూపిన ఆటో డ్రైవర్‌ను అభినందించిన పోలీసులు

చీరాల: పొట్టకూటి కోసం రోజూ ఆటో నడుపుతుం టాడు వేటపాలేనికి చెందిన తుపాకుల నారాయణ. ఎప్పటిలాగే ప్రయాణికులను ఎక్కించుకుని వారిని ఇంటి సమీపంలో వదిలి పెట్డాడు. ప్రయాణికులు దిగిన తర్వాత ఆటోలో చూడగా అందులో నగలుతో కూడిన బ్యాగును గమనించి నేరుగా చీరాల ఒన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించాడు. అప్పటికే బ్యాగు ఆటోలో వదిలి మరచిపోయిన చీరాల హయ్యర్‌పేటకు చెందిన స్టీఫెన్‌కుమార్‌ ఒన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యా దు చేసి ఉన్నాడు.

తాను హైదరాబాద్‌ నుంచి చీరాలలోని తన ఇంటికి వెళ్తుండగా ఆటోలో రూ.7లక్షల విలువైన బంగారు నగలు ఉన్న బ్యాగును ఆటోలో వదలి మరచిపోయినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐ సూర్యనారయణ, ఏఎస్‌ఐ రామబ్రహ్మంలు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీ లిస్తుండగా ఆటో డైవర్‌ నారాయణ తనకు ఆటోలో దొరికిన నగల బ్యాగును పోలీసుల సమక్షంలో స్టీఫెన్‌కుమార్‌కు అందజేశారు. ఆటో డ్రైవర్‌ నిజాయితీని పోలీసులు అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top