ఆటోడ్రైవర్ దారుణ హత్య | Auto driver murdered in prakasam district | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్ దారుణ హత్య

Sep 21 2014 10:54 AM | Updated on Sep 2 2017 1:44 PM

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని స్థానిక మరియమ్మ పేటలో ఆటోడ్రైవర్ బాబురావును ఆగంతకులు అత్యంత పాశవికంగా హత్య చేశారు.

గుంటూరు: ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని స్థానిక మరియమ్మ పేటలో ఆటోడ్రైవర్ బాబురావును ఆగంతకులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. అతడి కాళ్లు చేతులు కట్టేసి నరికి చంపారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి విచ్చేసి.... ముక్కలు ముక్కలుగా నరికిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ బాబురావు భార్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement