మరో మాటలేదు.. త్వరలోనే తెలంగాణ: దామోదర | As soon as possible telangana state formation, says Dy CM Damodar Raja Narasimha | Sakshi
Sakshi News home page

మరో మాటలేదు.. త్వరలోనే తెలంగాణ: దామోదర

Sep 5 2013 12:25 PM | Updated on Mar 18 2019 7:55 PM

త్వరలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఉద్ఘాటించారు.

త్వరలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని, ఈ విషయంలో మరో మాట తలెత్తే అవకాశమే లేదని ఆంధ్రప్రదేశ్(ఏపీ) ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఉద్ఘాటించారు. ‘తెలంగాణ ఏర్పాటులో రెండో అభిప్రాయానికి తావులేదు. రాష్ట్రం ఏర్పడి తీరుతుంది’ అని ఆయన అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం వెల్లడించిందన్నారు. తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న స్వామిమలై మురుగ ఆలయాన్ని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో పైవిధంగా మాట్లాడారు. ఇదిలావుంటే, ఏపీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ, ప్రజల కోరిక మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement