జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా అరుణా బహుగుణ! | Aruna Bahuguna to become first woman chief of National Police Academy | Sakshi
Sakshi News home page

జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా అరుణా బహుగుణ!

Dec 28 2013 2:11 AM | Updated on Sep 4 2018 5:07 PM

జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా అరుణా బహుగుణ! - Sakshi

జాతీయ పోలీస్ అకాడమీ డెరైక్టర్‌గా అరుణా బహుగుణ!

జాతీయ పోలీసు అకాడమీకి మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఐపీఎస్ అధికారి బాస్ కానున్నారు.

సాక్షి, హైదరాబాద్:  జాతీయ పోలీసు అకాడమీకి మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఐపీఎస్ అధికారి బాస్ కానున్నారు. మన రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణాబహుగుణ(56)కు ఆ అరుదైన గౌరవం దక్కనుంది. ఐపీఎస్ 1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ) డెరైక్టర్‌గా కేంద్రప్రభుత్వం నియమించనున్నట్లు సమాచా రం.

65 ఏళ్ల ఎన్‌పీఏ చరిత్రలో ఒక మహిళా అధికారి డెరైక్టర్‌గా నియమితులవడం ఇదే మొదటిసారి కానుంది. అకాడమీ డెరైక్టర్‌గా పనిచేసిన శుభాస్ గోస్వామి గత నెలలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి బదిలీ అయిన తరువాత ఇంతవరకూ ఎవర్నీ ఆ స్థానంలో నియమించలేదు. అరుణా బహుగుణను 28వ డెరైక్టర్‌గా నియమిస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. హైదరాబాద్ కేంద్ర స్థానంగా నిర్వహిస్తున్న ఎన్‌పీఏలో దేశంలోని ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారు.

కాగా ఐపీఎస్ 1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణ గతేడాది డెరైక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్‌గా కీలక బాధ్యతలకోసం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అంతకుముందు ఆమె రాష్ట్ర పోలీసుశాఖలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. అగ్నిమాపక, అత్యవసర సర్వీసుశాఖ డెరైక్టర్ జనరల్‌గా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. హైదరాబాద్ నగర పోలీసు అదనపు కమిషనర్‌గా, విజయవాడ ఎస్పీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement