సీఎంకు ఆర్టీసీ నిపుణుల కమిటీ నివేదిక

APSRTC Expert Committee Submitted a Report to the Chief Minister on Electric Buses - Sakshi

సాక్షి, అమరావతి : ఎలక్ట్రిక్‌ బస్సులపై నియమించిన ఆర్టీసీ నిపుణుల కమిటీ తన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. ఈ విధానంపై కమిటీ కొన్ని కీలక సిఫారసులను చేసింది. అవి

 • పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చి అందుకు అవసరమైన ఆదాయ వనరుల కోసం ‘పర్యావరణ పరిరక్షణ నిధి’ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా ఈవీ బాండ్లు జారీ చేయాలి.
 • ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద సోలార్ పవర్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ల వద్ద అనుకూలంగా ఉన్న చోట సోలార్ పవర్ రూఫ్లను ఏర్పాటు చేసుకోవాలి.
 • తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలిపిరి, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు భూములు కేటాయించాలి.
 • ఈ బస్సు టెండర్లలో రివర్స్ టెండరింగ్ పద్దతిని అనుసరించడం ఉత్తమం. 
 • విద్యుత్‌ వాహనాల ద్వారా ఇంధనం ఆదా
 • ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులతో వ్యయ నియంత్రణ
 • విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌ వినియోగ అవకాశాలను పరిశీలించాలి.
 • గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి భేటీ కావాలి.
 • రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రత్యేకంగా ఈ–బస్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి. 
 • తద్వారా సంబంధిత విభాగంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలను వేగంగా అమలు చేయడంతో పాటు, సంస్థకు అవసరమైన పథకాలను రూపొందించవచ్చు.
 • స్థూల వ్యయ కాంట్రాక్టుల (జీసీసీ)ను సమీక్షించడం కోసం తగిన యంత్రాంగం  ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా కాంట్రాక్ట్‌ సమయంలో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా చేయవచ్చు.
 • సంస్థలో 350 ఎలక్ట్రిక్‌ బస్సుల ఛార్జింగ్‌ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలి. 
 • ఇందులో రాయితీ పొందేందుకు ‘ఫేమ్‌–2’ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాథాన్యత క్రమంలో వాటిని చేపట్టాలి.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కమిటీ చైర్మన్‌ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top