మాజీ సీఎం కుమారుణ్ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ | apcc president suspends nedurumalli ramkumar reddy | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కుమారుణ్ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్

Mar 22 2015 10:29 AM | Updated on Aug 18 2018 9:03 PM

మాజీ సీఎం కుమారుణ్ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్ - Sakshi

మాజీ సీఎం కుమారుణ్ని సస్పెండ్ చేసిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు.. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు.. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు.

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందునే రామ్కుమార్ రెడ్డిని సస్సెండ్ చేసినట్లు ఆదివారం హైదరాబాద్లో రఘువీరా మీడియాకు చెప్పారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటిచేసి ఓటమిపాలైన రామ్కుమార్.. బీజేపీలో చేరతారనే వార్తలు గత కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఆయన కూడా ఈ వార్తలను ఖండించకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో రామ్ కుమార్ రెడ్డి కషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement