రుణమాఫీ చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధాన ప్రకటనలో అబద్ధాలతో నిండి ఉందని ఏపీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ : రుణమాఫీ చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధాన ప్రకటనలో అబద్ధాలతో నిండి ఉందని ఏపీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫేస్టోలో కూడా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న చంద్రబాబు ఇప్పడు మాట తప్పుతున్నారని మండిపడ్డారు.
రకరకాల కారణాలతో రైతులకు ద్రోహం చేస్తున్నారని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆరు అబద్ధాలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని రఘువీరా ధ్వజమెత్తారు.