
ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలు రద్దు
నవంబర్ 1వ తేదీన నిర్వహించాలని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ప్రభుత్వం రద్దుచేసింది.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు తర్జనభర్జన పడుతోంది. నవంబర్ ఒకటో తేదీన ఈ ఉత్సవాన్ని జరపకూడదన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్ రెండో తేదీ లేదా.. 8వ తేదీని అవతరణ దినోత్సవంగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ముందుగా విజయవాడలో నవంబర్ 1వ తేదీన నిర్వహించాలని ఇంతకుముందు తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ప్రభుత్వం రద్దుచేసింది.