7 నుంచి ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె | AP Municipal workers' strike from 7th | Sakshi
Sakshi News home page

7 నుంచి ఏపీ మున్సిపల్ కార్మికుల సమ్మె

Jul 5 2015 2:00 AM | Updated on Mar 23 2019 9:03 PM

ఏపీ మున్సిపల్ కార్మికులు ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టనున్నారు.

మంత్రి మమ్మల్ని అవమానించారు: కార్మిక సంఘాలు

హైదరాబాద్: ఏపీ మున్సిపల్ కార్మికులు ఈ నెల 7వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లపై చర్చల పేరుతో ప్రభుత్వం పలుమార్లు ఆహ్వానించి, అవమానించిందని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.

సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు జేఏసీ  ప్రకటించింది. పదేపదే చర్చల కోసం పిలిచిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తమను తీవ్రంగా అవమానించారని ఆరోపించింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement