ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. మొత్తం ఐదు ఖాళీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేయగా.. బరిలో ఐదుగురు అభ్యర్థులే నిలిచారు. దాంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అయితే ఇంకా దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి, తిప్పేస్వామిలు మంగళవారం నామినేషన్లు వేయనున్నారు.