పోలవరం : మరో అధికారిపై సస్పెన్షన్‌ వేటు | AP Govt Issued Orders For Tribal Welfare Executive Engineer Suspension | Sakshi
Sakshi News home page

ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీర్‌ సస్పెన్షన్‌

Feb 9 2019 8:36 AM | Updated on Feb 9 2019 9:13 AM

AP Govt Issued Orders For Tribal Welfare Executive Engineer Suspension - Sakshi

సాక్షి, జంగారెడ్డిగూడెం/పశ్చిమగోదావరి : పోలవరం పునరావాస ప్యాకేజీ (రిలీఫ్‌ అండ్‌ రిహబిలిటేషన్‌) లో అవినీతికి సహకరించారనే ఆరోపణలతో మరో అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జె.శాంతిశ్వరరావును సస్పెండ్‌ చేస్తున్నట్టు ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ పిన్సిపల్‌ సెక్రటరీ సిసోడియా ప్రకటించారు. జంగారెడ్డి గూడెం మండలంలోని తాడువాయి, చల్లవారి గూడెం, మంగిశెట్టి గూడెం గ్రామాల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో శాంతిశ్వరరావు అవినీతికి సహకరించినట్టు నిరూపణ అయిందని తెలిపారు. సుమారు 1200 వందల ఎకరాల భూసేకరణలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆర్‌ అండ్‌ ఆర్‌లో అవినీతి జరిగిందంటూ సాక్షి టీవీలో వెలువడిన పలు కథనాలకు అధికారులు స్పందించి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement