
ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని..
సాక్షి, అమరావతి : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడని, ఉన్నతమైన వ్యక్తని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. ప్రకాశం పంతులు తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని, తరతరాలకు ఆయన స్పూర్తిదాయకమని ట్విటర్‌లో పేర్కొన్నారు.
ప్రజలందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ భగవానుని జన్మదినాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటామన్నారు. పండుగ సందర్భంగా ప్రజలు కోరుకున్నవన్ని వారి సొంతం కావాలని, అన్ని వేళలా సకల సౌభాగ్యాలు లభించాలని ఆయన ఆకాంక్షించారు.