
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమైంది.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. శాంతిభద్రతలు ప్రధాన అజెంగా సమావేశం జరుగుతోంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమావేశం ప్రాధాన్యతను వివరించారు. అనంతరం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రంలో చేపడుతున్న చర్యల గురించి సభకు తెలిపారు.