బిర్యాని కోసం హోటల్ మారిన ధోని | Angry Dhoni leaves hotel to have Hyderabadi Biryani | Sakshi
Sakshi News home page

బిర్యాని కోసం హోటల్ మారిన ధోని

Sep 19 2014 9:40 AM | Updated on May 25 2018 7:45 PM

బిర్యాని కోసం హోటల్ మారిన ధోని - Sakshi

బిర్యాని కోసం హోటల్ మారిన ధోని

సెలబ్రిటీస్కు కోపం వచ్చిన సంతోషం వచ్చిన పట్టలేమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో మరోసారి రుజువైంది.

హైదరాబాద్: సెలబ్రిటీస్కు కోపం వచ్చిన సంతోషం వచ్చిన పట్టలేమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో మరోసారి రుజువైంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కూడా అయిన ధోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ఆడేందుకు హైదరాబాద్ వచ్చి గ్రాండ్ కాకతీయ హోటల్లో విడిది చేసిన ధోనికి హైదరాబాద్ బిర్యానితో అతిథ్యం ఇప్పించాలని కోరిక కలిగింది. అదే విషయాన్ని ధోనికి తెలిపారు. అందుకు ధోని సానుకూలంగా స్పందించాడు. దాంతో అంబటి రాయుడు ఇంటి నుంచి తయారు చేయించిన బిర్యాని తీసుకుని హోటల్ కు వచ్చాడు.

అయితే బయట ఆహారాన్ని అనుమతించమంటూ హోటల్ సిబ్బంది అంబటిరాయుడుకి బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదే విషయాన్ని అంబటి రాయుడు... ధోనికి తెలిపాడు. ధోని ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దీంతో అప్పటికప్పుడు హోటల్ మారుతున్నట్లు ధోని ప్రకటించి... తాజ్ కృష్ణాకు పయనమైయ్యాడు. ధోనిని బీసీసీఐ అధికారులు అనుసరించారు.

Advertisement
 
Advertisement
Advertisement