రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు మే 30వ తేదీలోపు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు మే 30వ తేదీలోపు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని చెప్పారు. శనివారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.00 గం.లకు విశాఖపట్నంలో టెన్త్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
అలాగే ఈనెల 21వ తేదీన కాకినాడలో ఎంసెట్ ఫలితాలు... ఆ వెంటనే 28న ఐసెట్ ఫలితాలు... జూన్ 1న డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. జూన్ మొదటివారంలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. టీచర్ల బదిలీలు, కౌన్సిలింగ్ పద్దతులను పారదర్శకంగా నిర్వహిస్తామని గంటా చెప్పారు.