ఏపీ మంత్రులకు నివాస భవనాలు కేటాయింపు | Andhra pradesh ministers allotted quarters in hyderabad | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రులకు నివాస భవనాలు కేటాయింపు

Jun 12 2014 12:45 AM | Updated on Sep 2 2017 8:38 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా నియమితులైన నలుగురికి హైదరాబాద్‌లో నివాస భవనాలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా నియమితులైన నలుగురికి హైదరాబాద్‌లో నివాస భవనాలను కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు క్యాంపు కార్యాలయం, నివాసానికి బంజారాహిల్స్ రోడ్డు నం. 12లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న ఎంబీ 30 నంబర్ భవనాన్ని కేటాయించారు. మంత్రులు పరిటాల సునీతకు ఎంబీ 25 నంబర్ నివాస భవనం, కె. అచ్చెన్నాయుడుకు ఎంబీ 28 నంబరు నివాస భవనం.. పైడికొండల మాణిక్యాలరావుకు ఎంబీ 27 నంబరు నివాస భవనాలను కేటాయించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement