జీఎన్‌ రావు కమిటీ నివేదికపై సూత్రపాయ చర్చ 

Andhra Pradesh Cabinet Meet Today To Discuss Several Issues - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్‌ రావు కమిటీ అందజేసిన నివేదికలోని సూచలనపై కేబినెట్‌ సమావేశంలో సూత్రపాయంగా చర్చ జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి కురసాల కన్నబాబు కూడా ధ్రువీకరించారు. అయితే, రాజధాని విషయంలో మరో అధ్యయన కమిటీ నివేదిక రావాల్సి ఉందని గుర్తుచేశారు. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక గురించి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని.. జీఎన్‌ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు రెండింటినీ క్రోడీకరించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

చంద్రబాబు అవినీతిపై నివేదిక..
కేబినెట్‌ భేటీకి ముందు మంత్రివర్గ ఉపసంఘం సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయింది. చంద్రబాబు పాలనలో అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘం సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక అందజేసింది. ఏసీబీ, విజిలెన్స్‌, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదిక సిద్దం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. 

చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top