హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్లో మృతి చెందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం సంతాపం ప్రకటించింది.
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్లో మృతి చెందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం సంతాపం ప్రకటించింది. విద్యార్థుల మృతికి సభలో సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలన్నారు. మరోవైపు ఇటీవలి మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. వారి మృతికి సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.