గిరిజనులు చేసిన దాడిలో ఓ ఫారెస్ట్ అధికారి గంగయ్య మరణించగా, మరో ఏడుగురి తీవ్ర గాయలయ్యాయి.
నిజమాబాద్ లో గిరిజనుల దాడిలో ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
Sep 15 2013 1:35 PM | Updated on Oct 17 2018 6:06 PM
హైదరాబాద్:
గిరిజనులు చేసిన దాడిలో ఓ ఫారెస్ట్ అధికారి గంగయ్య మరణించగా, మరో ఏడుగురి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలో ధార్ పల్లే మండలంలోని తండా అడవుల్లో శనివారం రాత్రి జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అటవీ భూములను ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి, తన సిబ్బందితో అక్కడికి వెళ్లగా గిరిజనులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు.
గిరిజనులు జరిపిన దాడిలో గంగయ్య అక్కడికక్కడే మరణించగా, ఏడుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాక ఫారెస్ట్ విభాగానికి చెందిన వాహనాన్ని కూడా గిరిజనులు తగులపెట్టారు. వ్యవసాయానికి భూమిని కేటాయించాలని డిమాండ్ చేయగా, అధికారులు నిరాకరించడమే ఈ సంఘటనకు కారణమని తెలుస్తోంది.
Advertisement
Advertisement