'ఓ చోట పొగడ్తలు... మరో చోట తిట్లు' | Anam Ramanarayana Reddy comments on State Bifurcation | Sakshi
Sakshi News home page

'ఓ చోట పొగడ్తలు... మరో చోట తిట్లు'

Feb 21 2014 1:53 PM | Updated on Sep 27 2018 5:59 PM

'ఓ చోట పొగడ్తలు... మరో చోట తిట్లు' - Sakshi

'ఓ చోట పొగడ్తలు... మరో చోట తిట్లు'

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొందిన నేపథ్యంలో విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల చేయగలిగిందేమి లేదని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొందిన నేపథ్యంలో విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల చేయగలిగిందేమి లేదని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ ...  ఇరు ప్రాంతాల ప్రజలు కలిసి ఉండాలన్న తమ ప్రయత్నం విఫలమైందన్నారు. రాష్ట్ర  విభజనపై అనేకమంది అనేకరకాలుగా మాట్లాడుతున్నారన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిర్ణయం తీసుకోలేదన్నారు. అన్ని పార్టీల సహకారంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్న నిజాన్ని అందరు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే, మరో ప్రాంత ప్రజలు చేస్తున్న నిందలు భరించవలసి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత తమందరిపై ఉందని ఆనం రాంనారాయణ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement