వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (50)రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (50)రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని బుధవారం ఉదయం రైల్వే పోలీసులు గుర్తించారు. ఖద్దరు పంచె, చొక్కా ధరించి ఉన్న అతని కుడిచేతిపై శ్రీరాముడు అని పచ్చబొట్టు ఉందని రైల్వే ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.