శిశుమరణాలపై సమగ్ర విచారణ: ఆళ్ల నాని | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు’

Published Sat, Jun 15 2019 10:42 AM

Alla Nani Did Inspection In Anantapur Hospital - Sakshi

సాక్షి,అనంతపురం : సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తీరు మారకపోతే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో గత ఆరు నెలల్లోనే దాదాపు 170 మంది నవజాత శిశువులు మరణించడం తెలిసిందే. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో మంత్రి ఆళ్ల నాని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. వైఎస్సార్‌ స్పూర్తితో ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు.

ఇక్కడి వాస్తవ పరిస్థితలు అధ్యయనం చేసేందుకే వచ్చానని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవినీతిని టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించిందని విమర్శించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. వెయ్యి దాటితే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. పేదలకు వైద్య సేవలను మరింత మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement