breaking news
Newborn Care Center
-
తగ్గిన శిశు మరణాలు..ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక సౌకర్యాలు
-
శిశుమరణాలపై సమగ్ర విచారణ: ఆళ్ల నాని
సాక్షి,అనంతపురం : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తీరు మారకపోతే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో గత ఆరు నెలల్లోనే దాదాపు 170 మంది నవజాత శిశువులు మరణించడం తెలిసిందే. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో మంత్రి ఆళ్ల నాని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. వైఎస్సార్ స్పూర్తితో ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఇక్కడి వాస్తవ పరిస్థితలు అధ్యయనం చేసేందుకే వచ్చానని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవినీతిని టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించిందని విమర్శించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. పేదలకు వైద్య సేవలను మరింత మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. -
6 నెలలు 170 మరణాలు
కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ నెలలు నిండకముందే 2 కేజీల బరువున్న పాపను ప్రసవించింది. కుటుంబీకులు నవజాత శిశువును ఆస్పత్రిలో ఎస్‌ఎన్‌సీయూలో చేర్చారు. ఈ నెల 9న రాత్రి పాప మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందిందని బాధిత కుటుంబీకులు ఆగ్రహం చేశారు. ఇలాంటి పరిస్థితి ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో నిత్యం చోటు చేసుకుంటోంది. గడిచిన ఆరు నెలల్లో ఏకంగా 170 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. సాక్షి, అనంతపురం న్యూసిటీ: నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ) ఆస్పత్రిలోని చాలా కీలకమైనది. నవజాత శిశువులకు చికిత్స అందించే ఈ వార్డుపై ప్రత్యేక దృష్టిసారించి సేవలందించాల్సిన పరిస్థితి. కానీ అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం...వైద్యులు ఇష్టానుసారంగా విధులు నిర్వర్తించడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరు నెలల్లోనే 170 మంది శిశువులు మృత్యువాత పడగా....ఎందరో తల్లులకు కడుపుకోత మిగిలింది. వైద్యుల ఇష్టారాజ్యం ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ఎస్ఎన్సీయూలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుబాటులో నలుగురు వైద్యులున్నా..ఒకరిద్దరు మినహా మిగితా వారు తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా గంటకోసారి పసికందుల ఆరోగ్య పరిస్థితిని చూడాల్సి ఉంది. కానీ కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ... స్టాఫ్‌నర్సులపైనే వైద్యులు భారం వేస్తున్నారు. స్టాఫ్‌నర్సులు సైతం నర్సింగ్ విద్యార్థినిలకు పసికందులను అప్పజెబుతున్నారు. ఎటువంటి అనుభవం లేని వారికి పసికందులను ఇవ్వడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. సూపరింటెండెంట్ వైఫల్యం వల్లే... సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్...ఎస్‌ఎన్‌సీయూపై దృష్టి సారించకపోవడం వల్లే వైద్యసేవల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కనీసం మందులను కూడా అందుబాటులో ఉంచకపోవడంతో రోగులంతా ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సూపరింటెండెంట్ తన ఛాంబర్‌ను వదిలి బయటకు రాకపోవడంతో వార్డుల్లో వైద్యులు ఇష్టానుసారం విధులు నిర్వర్తిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. -
అసలిది ఆస్పత్రేనా?
పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా.. * జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్ర హం * తీరు మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరిక * జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని వెల్లడి సంగారెడ్డి అర్బన్: ‘అసలిది ఆస్పత్రేనా.. పారిశుద్ధ్య నిర్వహణ ఇలా ఉంటే రోగాలు నయమవడం కాదు...కొత్త వ్యాధులొస్తాయి...ప్రైవేటు ఆస్పత్రులు ఇలాగే ఉంటాయా...అసలు మీరు పనిచేస్తున్నారా.. మీరే సరిగా పనిచేస్తే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుందా...ప్రధానమంత్రే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారు.. మీరు అంత కంటే ఎక్కువా..సిబ్బంది పనిచెప్పేముందు మనమూ చేసి చూపాలి’ అంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులన్నీ తిరిగి పరిశీలించారు. గైనిక్ ఓపి, నవజాత శిశు సంరక్షణ వార్డు తదితర విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని పిల్లల వార్డులో పారిశుద్ధ్యం కొరవడటం, గోడలు బూజు పట్టి ఉండటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడైనా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా అని ప్రశ్నించారు. అలసత్వం వీడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతకుముందు ఆస్పత్రి సిబ్బంది ఆయనకు స్వాగతం పలకగా ఏజేసీ మూర్తి పుష్పగుచ్ఛం అందజేశారు. మెడికల్ కళాశాల మంజూరుకు చర్యలు సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం రాజయ్య వెల్లడించారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇది వరకే కోరారన్నారు. వైద్యకళాశాల ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని 250 నుంచి 500 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మెరుగైన వైద్యం అందించాలి సర్కార్ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బందిలో చిత్తశుద్ధి లోపిస్తే, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదన్నారు. ఆస్పత్రిలో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. వారు పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. పారిశుద్ధ్య పనులు కాంట్రాక్టర్ చేస్తున్నట్లయితేఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించాలన్నారు. డ్యూటీ డాక్టర్ 24 గంటలూ వైద్యసేవలందించాలన్నారు. కాల్ డ్యూటీ డాక్టర్ పనిచేసే చోట అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వైద్యులైనా సరే ఇంటికి సాగనంపుతామన్నారు. జిల్లాలో వైద్యుల కొరత కారణంగా 80 శాతం రోగులు హైదరాబాద్‌లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 22 వైద్యాధికారుల పోస్టులను త్వరలో భ ర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రివాల్వింగ్ ఫండ్ రూ.28 లక్షలు ఉన్నాయని ప్రతిపాదనలు పంపిస్తే ఆ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. హెచ్‌డీఎస్‌లో ఉన్న రూ.5 లక్షలు కనీస అవసరాలు తీర్చేందుకు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ సీఎం వెంట జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ నాయకులు పిట్టెల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్ గౌడ్, అదనపు జే సీ మూర్తి, డీఎంహెచ్ఓ డా.బాలాజీ పవార్, ఆర్ఎంఓ డా.మురహరి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధుకర్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.