'ఎక్సైజ్ కేసులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే' | all cases booked online only says by excise department director | Sakshi
Sakshi News home page

'ఎక్సైజ్ కేసులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే'

Dec 5 2016 6:44 PM | Updated on Sep 4 2017 9:59 PM

'ఎక్సైజ్ కేసులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే'

'ఎక్సైజ్ కేసులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే'

ఎక్సైజ్ శాఖలో కేసులన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆదేశించారు.

- వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్ వెంకటేశ్వరరావు
అమరావతి :
ఎక్సైజ్ శాఖలో ఎన్‌ఫోర్సుమెంట్ సిబ్బంది నమోదు చేసే కేసులన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. సోమవారం అబ్కారీ భవన్ నుంచి అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అబ్కారీ సిబ్బంది మొత్తం ఎన్‌ఫోర్సుమెంట్ మాడ్యూల్ విధిగా పాటించాలన్నారు. కానిస్టేబుళ్లకు శిక్షణ కార్యక్రమం పోలీస్ శిక్షణ కేంద్రాల్లో ప్రతి మూడు నెలలకు జరుగుతున్నాయని, ఎక్సైజ్ కానిస్టేబుళ్లంతా హాజరు కావాలన్నారు.

ట్రాక్ అండ్ ట్రేస్‌పై పర్యవేక్షణ కరువు
ఎక్సైజ్ శాఖలో మద్యం అమ్మకాలను పర్యవేక్షించేందుకు గాను రెండున్నరేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానంపై మాత్రం ఉన్నతాధికారులు ఎవ్వరూ పర్యవేక్షించడం లేదు. ఈ విధానాన్ని కాంట్రాక్టు కిచ్చిన సంస్థకు మాత్రం విడతల వారీగా నిధులు విడుదల చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement