ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి : వి.వి.వినాయక్ | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం కావాలి : వి.వి.వినాయక్

Published Mon, Dec 2 2013 12:05 AM

aids - free society is our aim : vv vinayak

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎయిడ్స్ రహిత సమాజం ప్రతి పౌరుడూ కృషి చేయాలని ప్రముఖ సినీ దర్శకులు వి.వి.వినాయక్ పిలుపునిచ్చారు.  సమాజంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి పబ్లిక్‌గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
 
  ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి అవసరం ఉందన్నారు. ఇందుకు అన్ని వర్గాల వారు తోడ్పడాలన్నారు. కార్యక్రమం అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. వీరిలో పి.రవీందర్, బి.ఉమ, ఎస్.రామారావు, వెంకటలక్ష్మి తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ ప్రాజెక్టు మేనేజర్ నాగిరెడ్డి, అదనపు డీఎంహెచ్‌ఓ సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement