‘అలా చేస్తే మోదీని అభినవ వివేకానందుడిగా కీర్తిస్తారు’ | After That Modi Will Be Treated As Vivekananda Says Swaroopananda | Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం

Aug 5 2019 4:33 PM | Updated on Aug 5 2019 4:56 PM

After That Modi Will Be Treated As Vivekananda Says Swaroopananda - Sakshi

(ఫైల్‌)

హిందువులంతా మోదీని అభినవ వివేకానందుడిగా  కీర్తిస్తారని..

సాక్షి, విశాఖపట్నం : ఆర్టికల్‌ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయమని  విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద, ఉత్తరాధికారి స్వాత్మానందలు వ్యాఖ్యానించారు. సోమవారం ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయంపై ఇరువురూ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందనీయులన్నారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ఆర్టికల్‌ 370 రద్దు  దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో జమ్మూకశ్మీర్‌ ప్రజల సమగ్ర వికాసం సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు.  దేశంలోని శక్తి పీఠాలన్నింటినీ సందర్శించే అవకాశం ఇన్నేళ్లకు దక్కబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.

కశ్మీర్‌లోని సరస్వతీ శక్తి పీఠం పునరుద్ధరణకు ఉపయోగపడుతుందన్నారు. భారత సర్కారు స్వరస్వతీ శక్తి పీఠ పునరుద్ధరణకు పూనుకుంటే శారదా పీఠం సహకరిస్తుందని చెప్పారు. రామ జన్మభూమి, గోరక్షణ విషయాల్లోనూ ఇదే తరహాలో తక్షణ చర్యలు చేపట్టాలని, భారత దేశపు అధికారిక ఆధ్యాత్మిక చిహ్నంగా గోవును ప్రకటించాలని కోరారు.  ఈ చర్యలు చేపడితే హిందువులంతా మోదీని అభినవ వివేకానందుడిగా  కీర్తిస్తారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement