జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ దాడులు

ACB Raids In JC Diwakar Reddy Ex PA Suresh House At Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: ఏసీబీ దాడుల్లో టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ సురేష్‌రెడ్డి ఇంట్లో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. తనిఖీల్లో రూ.3 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వివరాలు.. పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా పనిచేశాడు. జేసీ దివాకర్‌రెడ్డి పదవిలో ఉన్నా లేకపోయినా సురేష్‌ తన సేవలను కొనసాగించాడు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డిని అ‍డ్డంపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడంటూ, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సురేష్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలో అధికారులు సురేష్‌ ఇంట్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.3 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లోని సురేష్‌ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top