సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు | ACB raid Sub registrar office and house | Sakshi
Sakshi News home page

సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు

Dec 29 2015 4:36 PM | Updated on Aug 17 2018 12:56 PM

సబ్ రిజిస్ట్రార్ ఆనందరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నారు.

మధురవాడ (విశాఖపట్నం) : సబ్ రిజిస్ట్రార్ ఆనందరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఆనందరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో విశాఖపట్నం ఏసీబీ అధికారులు, పశ్చిమగోదావరి ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయన కార్యాలయం, ఇంటిపై దాడులు నిర్వహించారు.

మధురవాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పశ్చిమగోదావరి ఏసీబీ డీఎస్‌పీ కరణం రాజేంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై విశాఖ ఏసీబీ డీఎస్‌పీ రామకృష్ణరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అలాగే పశ్చిమ గోదావరి నర్సాపురంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement