నిఘా నిద్ర.. దగా ముద్ర | Customers robbed from shops and market in gudur | Sakshi
Sakshi News home page

నిఘా నిద్ర.. దగా ముద్ర

Sep 26 2017 7:39 AM | Updated on Sep 26 2017 7:39 AM

 Customers robbed from shops and market in gudur

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , గూడూరు : తూనికలు– కొలతల అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో దుకా ణదారులు విజృంభిస్తున్నారు. ఫలి తంగా వినియోగదారుల జేబులకు చిల్లుపడుతోంది. తూకం వేసేటప్పుడు వ్యాపారులు చేస్తున్న మాయల వల్ల నిత్యం వేలాది మంది సామాన్యులు మోసపోతున్నారు. ఇందుకు కారణం అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించడమే.

సిబ్బంది కొరత
జిల్లా కేంద్రమైన నెల్లూరులో డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్పెక్టరే నెల్లూరు డివిజన్‌ లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన జిల్లాలోని అన్ని డివిజ¯Œన్‌లను పర్యవేక్షించడంతో పాటు జిల్లా కేంద్రం లో కూడా విధులు నిర్వహించాల్సి ఉంది. అదేవిధంగా గూడూరు డివిజన్‌లోని 16 మండలాల్లో సుమారు 5 వేల దుకా ణా లున్నాయి. వాటన్నింటినీ కూడా ఆ యనే తనిఖీలు చేయాల్సి ఉంది. అ లాగే ప్రస్తుతం గూడూరు లీగల్‌ మె ట్రాలజీ ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌గా కందుకూరులో పనిచేస్తున్న రామచంద్రయ్య విధులు నిర్వహిస్తున్నారు. కాగా కందుకూరులో 18 మండలాలు, పలు పట్టణాలు ఉన్నాయి. దీంతో ఆయన 34 మండలాలతో పాటు, మరో 10 పట్టణాల్లో కూడా తనిఖీలు చేయాల్సి ఉంది. అలాగే గూడూరు లీగల్‌ మెట్రాలజీ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో తనిఖీలు నిర్వహించాక, నిర్వహించాల్సిన రికార్డు వర్క్‌ సకాలంలో జరగడం లేదు. నిబంధనల మేరకు జరగాల్సిన తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయి.

పూర్తి వివరాలు ఉండాలి
దుకాణాల్లో విక్రయించే ప్రతి వస్తువుపై కూడా ఎమ్మార్పీ, ప్యాకింగ్‌ తేది, అడ్రస్, బరువు తదితర పూర్తి వివరాలు ఉండాలి. కానీ కొన్ని వస్తువులపై అలాంటి వివరాలు ఉండడం లేదు. అలాగే ఎలక్ట్రానిక్‌ కాటాలను ఏడాదికోసారి సర్టిఫైడ్‌ రిపేరల్‌లు వచ్చి తనిఖీ చేయాల్సి ఉంది. అనంతరం లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌లు సర్టిఫై చేస్తారు. అలాగే అడ్డకాటాలకు, వాటికి వినియోగించే కిలో నుంచి 50 గ్రాముల ఇనుప గుండ్లకు ప్రతి రెండేళ్లకోసారి ముద్రలు వేయించుకోవాల్సి ఉంది. కా నీ ఆ దిశగా చాలాచోట్ల జరిగిన దాఖలా లేదు. దీంతో వినియోగదారులు తూ కాల్లో దగాకు గురవుతూనే ఉన్నారు.

వెంకటరమణయ్య మార్కెట్‌కు వచ్చి కిలో టమోటాలు కొనుగోలు చేశారు. అయితే అవి కిలో ఉండవని ఆయనకు అనుమానం వచ్చి, తనకు తెలిసిన దుకాణంలో కాటా వేయించాగా టమోటాలు 850 గ్రాములు మాత్రమే ఉండడంతో అవాక్కయ్యారు. అలాగే సుబ్రహ్మణ్యం పండ్ల దుకాణానికి వెళ్లి కేజీ ఆపిల్‌ కొన్నారు. ఈయన కూడా అనుమానంతో వాటిని పక్కనే ఉన్న మరో దుకాణంలో కాటా వేయించగా 750 గ్రాములే ఉన్నాయి. అలాగే బియ్యం బస్తాల కొనుగోలు విషయంలో కూడా వినియోగదారులను కొందరు వ్యాపారులు మోసం చేస్తున్నారు. 25 కిలోల బియ్యం ఉండాల్సిన బస్తాలో కొన్ని దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా 22 లేదా 23 కిలోలుగా ప్యాక్‌ చేసి, వాటినే 25 కిలోలుగా చూపుతూ ఘరానా మోసానికి పాల్పతున్నారు. ఫలితంగా వినియోగదారులు ఒక బస్తాపై రూ.120 వరకూ నష్టపోతున్నారు.  

కొంత ఇబ్బందిగానే ఉంది
కందుకూరు లాంటి పెద్ద డివిజన్‌లో తనిఖీలు చేయడంతోపాటు గూడూరు డివిజన్‌లో ఇన్‌చార్జ్‌ బాధ్యతలతో కొంత ఇబ్బందిగానే ఉంది. అయినప్పటికీ తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఇక్కడ సిబ్బంది కూడా లేరు.  – రామచంద్రయ్య, గూడూరు లీగల్‌ అండ్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement