ఆటోబోల్తా: చిన్నారులకు గాయాలు | 6 children injured in auto accident | Sakshi
Sakshi News home page

ఆటోబోల్తా: చిన్నారులకు గాయాలు

Mar 30 2016 12:47 PM | Updated on Mar 9 2019 4:28 PM

స్కూలు నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారు.

పెద్దముడియం: స్కూలు నుంచి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మలమడుగుకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు రోజూ ఆటోలో వచ్చి వెళ్తుంటారు. బుధవారం మధ్యాహ్నం ఆరుగురు విద్యార్థులతో బయలుదేరిన ఆటో చిన్నముడియం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో చిన్నముడియం, చిన్నపసుపుల గ్రామాలకు చెందిన మూడు, నాలుగో తరగతుల చిన్నారులు గాయపడ్డారు. వారిని జమ్మలమడుగు ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement