రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అదనపు డీజీపీలతో సహా పదకొండు జిల్లాల ఎస్‌పీలు కూడా ఉన్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో అదనపు డీజీపీలతో సహా పదకొండు జిల్లాల ఎస్‌పీలు కూడా ఉన్నారు. అలాగే పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ కూడా ఇచ్చారు.
పశ్చిమగోదావరి, చిత్తూరు, అనంతపురం, వరంగల్ (రూరల్), ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, విజయనగరం, గుంటూరు (అర్బన్), కర్నూలు, కడప జిల్లాల ఎస్‌పీలను బదిలీ చేసి కొత్త ఎస్‌పీలను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.