విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని సెంట్రల్ బ్యాంకులో రూ.40 లక్షలు గోల్‌మాల్ అయ్యాయి.
విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని సెంట్రల్ బ్యాంకులో రూ.40 లక్షలు గోల్‌మాల్ అయ్యాయి. బ్యాంక్ క్యాషియర్‌గా పనిచేస్తున్న జి.యజమాని రెండు మూడు నెలలుగా ఈ నిధులను స్వాహా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.చంద్రశేఖరరావు తెలిపిన వివరాలివీ...సెంట్రల్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న యజమాని నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి సీనియర్ మేనేజర్ చంద్రశేఖరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు బ్యాంకు సొమ్ము రూ.40 లక్షలు దుర్వినియోగం చేసిన క్యాషియర్‌ను సస్పెండ్ చేశారు.