బకెట్‌లో పడి చిన్నారి మృత్యువాత | 4 years old girl drowns in bucket and dies | Sakshi
Sakshi News home page

బకెట్‌లో పడి చిన్నారి మృత్యువాత

Mar 19 2016 2:14 PM | Updated on Sep 3 2017 8:08 PM

నీళ్లతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బకెట్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : నీళ్లతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బకెట్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బోనాల షావలి, కృష్ణవేణి దంపతులకు పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత శ్రావణి(4) పుట్టింది.

శనివారం ఉదయం ఆమెకు స్నానం చేయించేందుకు తల్లి బాత్‌రూంకు తీసుకెళ్లింది. ఇంతలో కిచెన్‌లో పని గుర్తుకురావడంతో  చిన్నారిని నీళ్ల బకెట్ వద్ద వదిలి అటుగా వెళ్లింది. బకెట్‌లో నీళ్లతో ఆడుకుంటూ శ్రావణి అందులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూసేసరికే శ్రావణి నీళ్లలో ఊపిరాడక మృతి చెంది ఉంది. ఒక్కగానొక్క కూతురి మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement