తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం తుర్రేడు గ్రామంలో నారాయణ స్కూల్ బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది.
- నలుగురు విద్యార్థులకు గాయాలు
రాజమండ్రి రూరల్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం తుర్రేడు గ్రామంలో నారాయణ స్కూల్ బస్సు శనివారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడంవల్ల అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టినట్టు స్ధానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.