4 రోజుల్లో సిమెంట్ ధరలు తగ్గించాలి: పల్లె | 4 days, to reduce the amount of cement prices: the countryside | Sakshi
Sakshi News home page

4 రోజుల్లో సిమెంట్ ధరలు తగ్గించాలి: పల్లె

Feb 7 2015 7:09 AM | Updated on Aug 14 2018 4:01 PM

సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు వెంటనే ధరలను తగ్గించాలని ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు.

సాక్షి, హైదరాబాద్: సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు వెంటనే ధరలను తగ్గించాలని ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. నాలుగు రోజుల్లో సిమెంట్ ధరలను తగ్గించాలని, లేకుంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ధరలు తగ్గించకుంటే సిమెంటు కంపెనీలకు ప్రభుత్వం కల్పించే రాయితీలను కట్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. మంత్రి పల్లె శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో 11 సిమెంటు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం  మీడియాతో మాట్లాడుతూ.. శాస్త్రీయత లేకుండా పెంచిన ధరల్ని తగ్గించకుంటే  కఠిన చర్యలుంటాయని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement