సిలిండర్ లీకై భారీ ప్రమాదం | 3 injured in gas cylinder accident | Sakshi
Sakshi News home page

సిలిండర్ లీకై భారీ ప్రమాదం

Nov 24 2015 11:08 AM | Updated on Sep 3 2017 12:57 PM

విశాఖ నగరం తగరపువలస ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ లీకై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

తగరపువలస: విశాఖ నగరం తగరపువలస ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ లీకై భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిట్టివలస జెడ్పీ హైస్కూల్ వెనుక భాగంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. రెగ్యులేటర్ పెట్టేందుకు సిలిండర్‌కు ఉన్న క్యాప్ తీయగా, వెంటనే గ్యాస్ అధిక ఒత్తిడితో బయటకు వచ్చింది.

ఆ సమయంలో ఇంటి ముందు కట్టెల పొయ్యి వెలిగించి ఉండడంతో గ్యాస్ అక్కడకు వ్యాపించి అగ్ని ప్రమాదానికి దారి తీసింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఇళ్లంతా కాలిపోగా అక్కడున్న పడిమి వెంకటరామారావు (47), నూలు భాస్కర్ రావు (51), నూలు రామ్మూర్తి (59) అనే ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని కేజీహెచ్‌కు తరలించారు. నూలు భాస్కర్‌రావు పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement