ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నించిన తమిళ కూలీలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నించిన తమిళ కూలీలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 25 మంది కూలీలు వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు జయశెట్టి పల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్దంగా ఉన్నారన్న సమాచారంతో మంగళవారం పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీ అధికారులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. పోలీసులను చూసి కొంత మంది కూలీలు పరారు కాగా.. 20 మంది కూలీలు పోలీసులకు దొరికారు. వీరితో పాటు.. 23 దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 390 కిలోల బరువైన ఈ దుంగల విలువ 7 లక్షలకు పైగా ఉంటుందని డీఎస్పీ అరవింద్‌బాబు తెలిపారు.